Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు.. కాపు ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ.. ఇద్దని తప్పుపడుతున్నారు.. ఈ రోజు కిర్లంపూడిలో ముద్రగడను కలిశారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలుకు చెందిన కాపు నేతలు.. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు నాయుడే నంటూ ఫైర్ అయ్యారు.. ఇచ్చిన హమీని అమలు చేయకుండా.. రోడ్డేక్కే పరిస్ధితిని చంద్రబాబు కలగజేశాడన్న ఆయన.. గతంలో చంద్రబాబు పక్కన ఉన్న పవన్ కల్యాణ్.. ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదని దుయ్యబట్టారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Tapsee: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్?
ఇక, పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తాను.. కానీ, ఓటర్ల అమ్ముడు పోతారు అనే భావాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు.. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోయిన వారిగా పవన్ కల్యాణ్ మాట్లాడడం భాధాకరంగా ఉందన్నారు వైసీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. మరోవైపు.. ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కలిశారు.. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. ముద్రగడ పార్టీలోకి రావడం శుభ సూచికం, పార్టీకి కొండంత అండగా అభివర్ణించారు.. ముద్రగడ ఆశీస్సులతో కాకినాడ ఎంపీ, ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురంలో కూడా వైసీపీ జెండా ఎగురుతుంది.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్.