Kakarla Suresh: ఎన్నికల శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి ప్రజా గళం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అందులో భాగంగా రేపు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ.. శంఖారావాన్ని పూరించి రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణ బద్దుడై వస్తున్నారని, ఈ శంఖారావంతో వింజమూరు అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ గెలవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు.
వింజమూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ చంచల బాబు మరియు రాబిన్ శర్మ టీంతో కలిసి వింజమూరు పట్టణంలోని బంగ్లా సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, పంచాయతీ బస్టాండ్, పాత బస్టాండ్ సెంటర్లను పరిశీలించారు. అన్నిటికీ అనువైన స్థలం పంచాయతీ బస్టాండ్ గా నిర్ణయించారు. రోడ్ షో అనంతరం కాన్వాయ్ పైనుండి అక్కడే సభ నిర్వహించేందుకు పెద్దలందరితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్ణయించారు.
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని.. వీరికి వత్తాసుగా పోలీస్ రెవిన్యూ మరియు ఇతర శాఖల అధికారులందరు నడుస్తున్నారని ఆరోపించారు. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం అని.. వీరందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిశాయని.. ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం చంద్రబాబు ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ స్థలాన్ని రాఘవేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో నిర్ణయించారు. ఆ స్థలాన్ని నాయకులందరూ వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, కాకర్ల వెంకట్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, గణపం సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దంతులూరి వెంకటేశ్వరరావు, కోడూరు నాగిరెడ్డి, షేక్ మహబూబ్ బాషా, నీలం పెరుమళ్ళ, ఇతర ముఖ్య నేతలు అభిమానులు ఉన్నారు.
Renu Desai: యోధుడిలా పవన్ కల్యాణ్ తనయుడు అకీరా.. వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు