YSRCP: చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం అని ప్రకటించారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్.. చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఇద్దరు నేతలు.. తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చులు పెడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడడు అని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం.. మేం అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన ఉణికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Read Also: Deepak Chahar: సీఎస్‌కే కెప్టెన్ ఎవరో తెలియక తికమక పడుతున్నా: దీపక్ చహర్
Also Read
చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు అని దుయ్యబట్టారు ఎంపీ రెడ్డప్ప.. వైసీపీని చూసి చంద్రబాబు భయపడి.. డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారన్న ఆయన.. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్లే పాల్గొన్నారు.. కానీ, కుప్పం వాళ్లు లేరని విమర్శించారు. ఇక, వాలంటీర్ల పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం అన్నారు. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది.. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? అని నిలదీశారు. అసలు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్..
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!