తప్పు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడిని చిత్తూరు ఎమ్మెల్యేగా పెట్టారని.. రాష్ట్రాన్ని స్మగ్లింగ్‌కు అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పించారు.
వింజమూరు మండల కేంద్రంలో శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్యం కోసం తలపెట్టిన ప్రజాగళం దద్దరిల్లింది. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో.. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుండి తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాగళం సభకు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని జనం చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు. చంద్రబాబు నాయుడు మాటలు ఆసక్తిగా విన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు.…
నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ2 అయితే చంద్రబాబు పలు కేసుల్లో ఏ1 అని..తాను 22 కేసుల్లో ఏ2 కావచ్చు.. కానీ ఎక్కడా కూడా ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్‌కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీని ఇప్పుడు సరికొత్త భయం వెంటాడుతోందా? పొత్తులో భాగంగా ఇప్పటికే సీట్లు వదిలేసుకున్న సైకిల్ పార్టీకి తాజాగా మరో రూపంలో ముప్పు ముంచుకు వస్తోందా? ఆ ముప్పును వైసీపీ ఇంకాస్త ఎగదోస్తోందన్న వాదనలో నిజమెంత? అది ఎక్కడికి దారి తీస్తుందోనని పార్టీ పెద్దలు ఆందోళన పడుతున్నారన్నది నిజమేనా? అసలింతకీ ఏంటా ముప్పు? టీడీపీ అధిష్టానం ఆందోళనకు కారణాలేంటి? అభ్యర్థుల లిస్ట్‌ని పూర్తిగా ప్రకటించేసింది టీడీపీ. అన్ని రకాలుగా వడపోసి.. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని.. రకరకాల…
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో టీడీపీ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు అభివృద్ధి చేయడం చేతకాదని.. రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ అన్ స్థాపబుల్ అని.. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.
చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. టిప్పర్ డ్రైవర్ అని, వేలిముద్ర గాడు అని చంద్రబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శింగనమల అభ్యర్థిని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.