వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను.. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. కానీ, ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్‌రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు అని పేర్కొన్నారు.
తుపాకీ తూటా….మనిషి మాట….ఒక్కసారి బయటకు వచ్చాయంటే చెయ్యాల్సిన నష్టం చేసేస్తాయి. రాజకీయాల్లోనైతే ఒక్కోసారి ఆ మాట చేసే నష్టం ఊహకు అందదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ ఓ మాట తూటాలా పేలింది. ఒకరికి అది బౌన్సర్ గా మారితే…మరొకరికి బౌన్స్ బ్యాక్ గా ఫుల్ పబ్లిసిటీ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇది ఎన్నికల సమయం. మాటే తూటా. ఒక్కోసారి ఆ మాటల తూటా రివర్స్ అయి మనకే తగులుతుంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి…
సిటిజన్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ, బీజేపీల బినామీ చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు టీడీపీ హయాంలో పదవి అనుభవించారన్నారు. నిమ్మగడ్డ రమేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఒక…