టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.
కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..! కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా…
పెన్షన్ల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఇంటింటి ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు పార్టీ కేడరుకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను.. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. కానీ, ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్‌రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు అని పేర్కొన్నారు.