ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. వైసీపీకి ఓటువేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. అందులో భాగంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. నిజం ఒకవైపు అబద్ధం ఒకవైపు ఉంది.. మంచి ఓవైపునా చెడు మరోవైపునా ఉంది.. ధర్మం ఒకవైపు.. అధర్మం మరోవైపు ఉన్నాయి..…
నేడు అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక, రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కి అందరూ ఓటేయాలని కొందరు ప్రజల ముందుకు వస్తున్నారు.. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి ఎందుకు ప్రజలు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఒక ఇల్లు ఇచ్చారా.. సెంటు జాగా ఇచ్చారా.? ఓటెందుకు వేయాలన్నారు. నిన్న ఒకటో తేదీ పింఛన్ డబ్బులు సుర్యోదయం కాకముందే ఇచ్చేసేవారు.. పింఛన్ ఎందుకు రాలేదో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాలంటీర్లు పింఛన్ ఇవ్వొద్దని చంద్రబాబు పిటిషన్ పెట్టేసాడని…
పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులందరికీ ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలి.. పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెర దించాలని కోరారు. లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల…