రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాగళంకు భారీ స్పందన వస్తోందని.. వచ్చే 39రోజుల్లో జోరు పెరగాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. బందిపోట్లు పడ్డారు.. వారందరికీ నాయకుడు జగన్ అంటూ విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు ,మార్కాపురం,బాపట్ల సభల్లో చంద్ర బాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పని చేస్తున్నారని విమర్శించారు.
ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. వైసీపీకి ఓటువేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. అందులో భాగంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. నిజం ఒకవైపు అబద్ధం ఒకవైపు ఉంది.. మంచి ఓవైపునా చెడు మరోవైపునా ఉంది.. ధర్మం ఒకవైపు.. అధర్మం మరోవైపు ఉన్నాయి..…