బొత్స సత్యనారాయణ.. ఉత్తరాంధ్రలో కీలక నేత.. అక్కడ వైసీపీకి పెద్ద దిక్కు. ఉమ్మడి రాష్ట్రంలోను, విడిపోయాక కూడా పవర్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారాయన. ప్రస్తుతం వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగలిగిన కొద్దిమంది నేతల్లో ఆయన కూడా ఒకరు.
Ambati Rambabu: ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
Minister Payyavula: పలేగాళ్ల రాజ్యం గురించి విన్నాం.. కప్పం గట్టమని పొలంలో పంటలు కోసుకుపోయారు.. పాలేగాళ్ల వంశానికి చెందినవాడు జగన్ అని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. పాలేగాళ్ల రాజ్యం తిరిగి తీసుకురావాలని జగన్ చూస్తున్నారు.. చంద్రబాబు 100 రోజుల్లో 6 పంపుల నుంచి 12 పంపుల ద్వారా నీరు విడిచే విధంగా పనులు చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది.. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు.. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ సాగింది.. గంటన్నరపాటు సాగిన ఈ భేటీ ముగిసిన తర్వాత ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో…
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ఒకటే ఎజెండాగా పెడితే చర్చలకు రాలేమని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పామన్నారు. అలాగే, ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలను చంద్రబాబు, జగన్ అక్రమంగా తరలించుకుపోయారని ఆరోపించారు.
Telugu CMs Meeting: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే.. అందుకే ప్రజలకు చెబుతున్నాం.. చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.. మానసికంగా వేధిస్తున్నారు.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారని సజ్జల ప్రశ్నించారు.
Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని K కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్ కు దూమాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు.
Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆ విషయం కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. ప్రజలకు లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి..
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.