AP and Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది.. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు.. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ సాగింది.. గంటన్నరపాటు సాగిన ఈ భేటీ ముగిసిన తర్వాత ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు..
Read Also: 8 vasanthalu: థియేటర్లో దేఖలేదు.. ఇప్పుడేమో తెగ లేపుతున్నారు!
ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు మంత్రి నిమ్మల.. తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే స్ఫూర్తితో ఈ రోజు చర్చలు జరిగాయి. మూడు అంశాలపై నిర్ణయాలు జరిగాయి.. రిజర్వాయర్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని లెక్కలు వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.. శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు ప్రజల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. శ్రీశైలం ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు సత్వరమే చేపట్టాలని నిర్ణయించారు.. గోదావరి నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం హైదరాబాద్ లో, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు నిమ్మల రామానాయుడు..
Read Also: Motorola Edge 60 Fusion vs OnePlus Nord CE 5: మిడ్ రేంజ్ లో ఏ ఫోన్ బెస్ట్..? ఎందుకు..?
ఇక, తెలంగాణ ప్రస్తావించిన పలు అంశాల్లో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి.. కాబట్టి, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన సాంకేతిక నిపుణులు, పాలనాపరమైన అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఏపీ మంత్రి రామా నాయుడు.. “బనకచర్ల” ప్రాజెక్ట్ తో పాటు, ఇతర అన్ని అంశాలను కూడా ఈ ప్రత్యేక కమిటీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుంది. జాప్యం లేకుండా, వచ్చే సోమవారం కల్లా ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..