ఇక చంద్రబాబు తప్పుకోవాలి.. టీడీపీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది అధికార పార్టీ.. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇక, కుప్పంలో కూడా వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికలపై ఫలితాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో వైసీపీ ఒక జిల్లాకు, మున్సిపాలిటీ కి పరిమితం కాలేదని స్పష్టమైందన్నారు.. ఇక, చంద్రబాబుకి సర్పంచ్ ఎన్నికలే దిక్కన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయవాణి హైస్కూల్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని విమర్శించిన ఆయన.. ప్రజలు ఛీ కొట్టిన తర్వాత ఇంకా చంద్రబాబు కుప్పం గురించి మాట్లాడతారని నేననుకోను అన్నారు.
Read Also: ఇది సీఎం జగన్ ప్రభంజనం.. టీడీపీ ఆఫీసు ఇక అద్దెకే..!
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
మరోవైపు తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబుది కాదు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. సొంత నియోజకవర్గంలోనే మూలాలు పోయిన తర్వాత ఇంకా చంద్రబాబు కొనసాగటం కరెక్ట్ కాదన్న ఆయన.. చంద్రబాబు తప్పుకుని పార్టీని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించడం మంచిదని సూచించారు.. నా మీద చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ చాలా దుర్భాషలాడారని గుర్తుచేసుకున్న ఆయన.. నేను 17వ తేదీన మాట్లాడతానని ఆ రోజే చెప్పానన్నారు.. మరోవైపు, చంద్రబాబు పుంగనూరు వచ్చి పోటీ చేస్తానంటే నేను ఆహ్వానిస్తానన్నారు మంత్రి పెద్దిరెడ్డి… చంద్రబాబు నా మీద పోటీ చేస్తారేమో ఆయన్నే అడగండి అంటూ మీడియాకు సూచించారు.
తాజావార్తలు
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!