ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే జగన్’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా సీఎం జగన్‌కు విషెస్ చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ట్వీట్‌కు విశేష స్పందన లభిస్తోంది. నిమిషాల వ్యవధిలో…
ఏపీ హైకోర్టుపై ఇటీవల విమర్శలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబు పక్షమో, జగన్ పక్షమో కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు.. వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు విని, సమన్యాయం అందించేందుకు ప్రయత్నించాలని మాత్రమే తాను చెప్పానని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విషయం తన వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె.. తిరుపతిలో వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించారు.. 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరిని.. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. రాజకీయాలు నేను మాట్లాడను…
ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పౌరులకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్ర ప్రదేశ్‌గా ఎన్నో హంగులతో…
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? రాబిన్‌శర్మ బృందంతో టీడీపీ పరిస్థితిపై సర్వే..! గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్…
పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ టీడీపీని కలవర పెడుతున్నాయా? ఈ మధ్య కాలంలో టీడీపీని జనసేనాని ఎక్కడా విమర్శించకపోయినా.. ఆందోళన ఎందుకు? పవన్ చూపిస్తున్న సింపతీపై తమ్ముళ్ల లెక్కలేంటి? లెట్స్ వాచ్..! టీడీపీని జనసేనాని తిట్టకపోయినా.. తమ్ముళ్లలో టెన్షన్..! కొంతకాలంగా జనసేనాని పవన్‌కల్యాణ్ సీఎం జగన్ మీద.. YCP ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికారపార్టీ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. అలాగే పవన్ ఏపీకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి రాజకీయం కాస్తో కూస్తో వేడెక్కుతూనే ఉంది.…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. 3 టాయిలెట్లు కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హామీ నేరవేర్చని జగన్ ప్రజలకు ఇప్పుడేం చెబుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. రెండెన్నరేళ్లలో రాష్ట్రాన్ని జగన్ దారుణంగా ధ్వంసం చేశారన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీ ఆర్ధిక కష్టాల…
చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..? టీడీపీని చక్కదిద్దుకునేందుకు చికిత్స మొదలుపెట్టిన ఆయనకు.. వాస్తవాలు తెలుస్తున్నకొద్దీ కోపం నషాళానికి ఎక్కుతోందా? కొందరు కోవర్టులుగా మారారనే అనుమానం రోజు రోజుకూ బలపడుతోందా? చేతలు కాలక ఆకులు పట్టుకున్న బాబు.. ఆగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా..? మధ్యలోనే మెత్తబడతారా..? పార్టీ చీఫ్‌కు వచ్చిన కోపంపై తమ్ముళ్లలో చర్చ..! టీడీపీలో కోవర్టులున్నారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మండలం.. నియోజకవర్గం.. జిల్లా స్థాయిల్లో కాదని.. ఏకంగా రాష్ట్రస్థాయిలోనే కోవర్టులు ఉన్నారని.. వారిని ఏరిపారేస్తానని కుప్పం సమీక్షలో చెప్పారు…
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడి ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్‌ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.బయటకు రాలేకే మృతిచెందారు. ప్రమాదంలో వెంటనే…