ఏపీలో సంచలనం కలిగిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాు.ఈ స్కాంలో సీఐడీ విచారణ లోతుగా కొనసాగిస్తోంది. రూ.242 కోట్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు అనేక అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇందు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ, ముంబైలలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ, పూణేలోని షెల్ కంపెనీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. డిజైన్ టెక్ కి తాము ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వలేదని పూణే సంస్థలు స్పష్టం చేశాయని…
అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని… వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్…
చంద్రబాబు పై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సెటైర్లు వేశారు. అఖండ సినిమా చూసిన ఫ్రస్టేషన్ తో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉన్నారు. చంద్రబాబు చూడాల్సింది జస్టిస్ చంద్రు మాట్లాడిన వీడియో…. ఆ వీడియోలు చూసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్ని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో టీడీపీ స్కిల్ తో చేసిన స్కాంను బయట పెట్టాల్సి న బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉంది. స్ట్రా వేసి తమ ఐదేళ్ళ కాలంలో ఎంతో…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం కన్నులపండుగగా జరిగింది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరినాలో వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక వివాహం వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన రవితేజను వెంకయ్య మనవరాలు నిహారిక వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు…
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఎప్పటికప్పుడూ కొత్త తరహా ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ మూడు పార్టీలు ఎప్పుడైనా ఏకం కావొచ్చు అనే అంచనాలుంటాయి.. అయితే, ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుండగా.. టీడీపీ విడిగానే రాజకీయాలు చేస్తోంది.. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల కలిసి పనిచేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.. కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల…
కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా అని చంద్రబాబు అన్నారు. ఇక నన్ను మెప్పించడం కాదు.. ప్రజల్లో పనిచేసిన వారికే గుర్తింపు. స్థానిక నేతల అతి విస్వాసం వల్లనే కుప్పంలో ఓటమి తప్పలేదు. కుప్పం స్థానిక నాయకత్వంలో మార్పులు చెయ్యాలన్న కార్యకర్తల సూచనలు అమల్లోకి తెస్తానన్న చంద్రబాబు… ఇకపై తరుచూ కుప్పంలో పర్యటిస్తానని.. కార్యకర్తలకు, నేతలు ఎక్కవ…
చంద్రబాబుపై మరోమారు ఫైర్ అయ్యారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. చంద్రబాబు కుప్పంను కబ్జా చేసి కోటలాగా మార్చుకున్నాడని… కుప్పంలో చంద్రబాబును దారుణం ఓడించారని ఆగ్రహించారు. అమరావతి యాత్ర ప్రజల యాత్ర కాదు.. టీడీపీ నేతలే యాత్ర చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబుకు ఎక్కడో చోట గొడవ కావాలి.. అదే ఆయన రాజకీయం అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఆగ్రహించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రాజకీయ పదవుల్లో కూడా…
కుప్పం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కావడంతో అందరూ ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూస్తారు.. ఒక్కప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేది.. అయితే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడిపోయింది.. ఏకంగా చంద్రబాబు, లోకేష్, ఇతర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా.. అధికార వైసీపీ ఎత్తుల ముందు చిత్తైపోయారు..…
బాహుబలి సైన్యంలా వెళ్లారు. తీరా యుద్ధంలో చతికిల పడ్డారు. 20వార్డులకు రెండుచోట్లే గెలిచారు. ఈ ఫలితాలతో ఆ జిల్లా నేతలకు అధినేత నుంచి అక్షింతలు పడ్డాయట. డైలాగ్ కొంచెం తేడా కావొచ్చేమో కానీ.. తమ్ముళ్లకు సీరియస్‌గానే తలంటారట. టీడీపీలో చర్చగా మారిన ఆ పోస్టుమార్టం ఏంటి? లెట్స్ వాచ్..! పెనుకొండ పురపోరులో పాతికమంది టీడీపీ నేతల ప్రచారం..! రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ పోరు పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. కుప్పం తరువాత అంత హైప్…