నేడు టీడీపీ అధినేత కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా రెండు ఘటనలు కుప్పంలో నన్ను బాధించాయని ఆయన అన్నారు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు నన్ను బాధపెట్టాయని, కుప్పంలో డబ్బులు పంచే తీరు ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. వెయ్యి, రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అని, కుప్పంలో ఓటమి అంటూ నన్ను ఎగతాళి చేస్తే….మిమ్మల్ని అన్నట్లు కాదా..?…
ఆ మాజీ మంత్రికి ఎప్పటి లెక్క అప్పుడేనా? ఏ రోటికాడ ఆ పాట పాడతారా? ఇప్పుడు ఉనికి ప్రమాదంలో పడిందని కులం కార్డు ప్రయోగిస్తున్నారా? ఈ మార్పు వెనక రాజకీయ వ్యూహం ఉందా? నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి. ఇవీ గంటా శ్రీనివాసరావు పొలిటికల్ బయోగ్రఫీలో కీలక అంశాలు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా.. తాను ఉన్న టీడీపీ అధికారానికి దూరంగా కావడంతో సైలెంట్ అయ్యారు. మధ్యలో గంటా వైసీపీలోకి వెళ్తున్నారని…
టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పనితీరు, నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇన్‌చార్జ్‌లు వారి వారి నియోజకవర్గాల్లో పని చేసి తీరాల్సిందేనన్నారు. పనిచేయలేని ఇన్‌చార్జ్‌లు ఎవరైనా ఉంటే దండం పెట్టి పక్కకు తప్పుకోండని చెప్పారు. పని చేయని ఇన్‌చార్జ్‌లు…
పాత తెలుగు సినిమాల్లో శాపనార్థాలు పెట్టే సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు రెండు గంటల ప్రసంగంలో శాపాలు పెట్టడమే సరిపోయింది. చంద్రబాబు స్పీచ్ తో కార్యకర్తలకు కూడా ఊపు రావటం లేదు. ముందు కుప్పంలో నాయకత్వం మార్చాలి. చంద్రబాబు విఫల నాయకుడు. టీడీపీ ఓ విఫల పార్టీ. ప్రయత్నం కూడా చేయకుండా అప్పనంగా అధికారం రావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
ఏపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ చేసిన డామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అన్నారు.. కరోనా వైరస్‌కి మందుందేమో కానీ.. జగన్ వైరస్‌కి మందు లేదని మండిపడ్డారు.. ఏపీ అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరిందన్న బాబు.. ఉద్యోగులకు చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్మెంట్ టీడీపీనే ఇచ్చిందన్నారు.. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం…
మాజీ సీఎం, ఏపీలో విపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని ఓర్వలేక చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు.…
ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ అంశంపైనైనా అంతా మోసమే చేశారన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఐదేళ్ళలో 20వేల కోట్లు మాత్రమే పెట్టుబడులుగా వచ్చాయన్నారు. కడప, తిరుపతిలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు.
ఏపీలో రాజకీయ కాక రేపుతోంది వంగవీటి రాధా రెక్కీ ఎపిసోడ్. ఈ కీలక అంశంపై మొదటి సారి స్పందించారు మంత్రి కొడాలి నాని. కొడాలి నాని సమక్షంలోనే తన హత్యకు రెక్కీ జరిగిందని వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు టీడీపీ నేత వంగవీటి రాధా. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకే అన్నారు నాని. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తనను హత్య చేయటానికి రెక్కీ జరిగిందని రాధా నా సమీక్షంలోనే…
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు…
న్యూఇయర్ రోజు విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఒంగి తనకు నమస్కారం పెట్టడంపై స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అది పెద్ద చిన్నా తారతమ్య సంస్కారానికి సబంధించిన అంశం అన్నారు. ఆయనేమీ నాకు సాష్టాంగం చేయలేదు, కాళ్లు పట్టుకోలేదు. వయసులో 20 ఏళ్ల పెద్ద వాళ్ళు కనిపించినపుడు వంగి నమస్కరించడం మన సంప్రదాయం అన్నారు బొత్స. సాంప్రదాయాలను కూడా వక్రీకరించి విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. హయగ్రీవ భూముల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే…