పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే… జగన్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఓటీఎస్‌లాగా జగన్‌కు ప్రజలు వన్ టైం పాలనను అందించారన్నారు. వైసీపీ వాళ్లు కొత్త బిచ్చగాళ్లు అని.. వాళ్లకు చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. పొత్తులపై వైసీపీ నేతలవి పనికిమాలిన వ్యాఖ్యలు అని ఆరోపించారు. తాము గతంలో పొత్తులతో గెలిచామని.. పొత్తులు లేకుండా కూడా గెలిచామని గుర్తుచేశారు. ఒక్కోసారి పొత్తులు ఉన్నా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితి దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: స్మశానవాటికలో హెల్త్ క్లినిక్… టీడీపీ నేతల వరుస అరెస్టులు
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
జగన్ విధ్వంసక పాలన పోవాలంటే ధర్మపోరాటం చేయక తప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ చేసే ధర్మపోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పం ప్రజలకు తనకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని, అలాంటి బంధాన్ని వైసీపీ వచ్చి చెడగొట్టిందని, అందుకే ఇప్పుడు ఎమోషనల్‌గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అనేక సేవా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలకు ప్రజలు త్వరలో చెవులు పూలు పెట్టే రోజులు వస్తాయన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌లను స్టాలిన్ సర్కారు కొనసాగిస్తుంటే.. ఏపీలో మాత్రం అన్న క్యాంటీన్‌లను జగన్ ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. రాష్ట్రం జగన్ జాగీరు కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. కరోనా వల్ల ఏపీ ఆదాయం తగ్గలేదని… జగన్ పరిపాలన వల్లే ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈసారి పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!