నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పనిచేయకుంటే పక్కకు తప్పుకోండి: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పనితీరు, నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇన్‌చార్జ్‌లు వారి వారి నియోజకవర్గాల్లో పని చేసి తీరాల్సిందేనన్నారు. పనిచేయలేని ఇన్‌చార్జ్‌లు ఎవరైనా ఉంటే దండం పెట్టి పక్కకు తప్పుకోండని చెప్పారు. పని చేయని ఇన్‌చార్జ్‌లు పక్కకు తప్పుకుంటే పార్టీ ఏం బాధపడదన్నారు. పని చేయలేని వారు తప్పుకుంటే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం వస్తుంది. పనిచేయకుండా పదవులు వచ్చేయాలని ..పార్టీ అధికారంలోకి వచ్చేయాలని కోరుకుంటే అయ్యేపనికాదని చంద్రబాబు అన్నారు.
Read Also:నేను దళిత వ్యతిరేకిని కాదు: గోనెప్రకాశ్‌రావు
Also Read
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
కుప్పం నియోజకవర్గం పార్టీకి తిరుగులేని నియోజకవర్గం. అక్కడి ఓటర్లకు నేనంటే అభిమానం. అలాంటి కుప్పం నియోజకవర్గంలో కూడా ఇబ్బంది పెట్టారు. కుప్పంలో నన్నే ఇబ్బంది పెట్టారంటే.. మిగిలిన సెగ్మెంట్లల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. పార్టీలో ఉంటూ నష్టం చేసే వ్యక్తులను ఊపేక్షించను. వచ్చే ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావు. రౌడీయిజాన్ని, విధ్వంసాన్ని తట్టుకుని నిలబడాలి. ఢీ అంటే ఢీ అనే నాయకత్వమే కావాలని చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు దిశా నిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?