ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ పేరుతో పథకాన్ని అమలు చేశామని.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్…
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నెలరోజులుగా టీడీపీ పనికిమాలిన చర్చ పెట్టిందని.. అదాన్ అనే కంపెనీ తనదేనని దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్తే నిజమై పోతుందని టీడీపీ నమ్మకమని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన అల్లుడు కంపెనీకి చెందినవాడని ఆరోపిస్తున్నారని.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విదాన్ అటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్…
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళిత యువకుడు నారాయణ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సీఎస్‌కు రాసిన లేఖ కాపీని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కూడా చంద్రబాబు పంపారు. పోలీసుల దెబ్బల కారణంగానే దళిత యువకుడు నారాయణ చనిపోయాడని.. రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనార్టీలు, మహిళలు, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. నారాయణ మరణం ఏపీలోని ఒక…
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదరణ కోల్పోయ్యారంటు చంద్రబాబు చెప్పడం చూస్తూంటే ఆయనకి చిన్న మెడదు చితికిందా..? అనే అనుమానం కలుగుతోందన్నారు మంత్రి ఆర్కే రోజా
కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనపై దేశంలో ప్రముఖ సర్వే సంస్థ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే (సీఎన్ఓఎస్) భారీ సర్వే నిర్వహించింది. ప్రభుత్వ విధానాలు, పాలకుల పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయం సేకరించింది. సీఎన్‌వోఎస్ తాజా సర్వే ఫలితాల్లో ప్రధాని మోదీకి గతంలో కంటే ప్రజాదరణ కాస్త పెరిగింది. మోదీ నికర ఆమోదం రేటింగ్ 36 పాయింట్లుగా ఉంది. 54 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారు. 18…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేస్తున్నారు. చెట్లని కొట్టేస్తే పెంచొచ్చు.. కొండల్ని తవ్వేస్తే ఎలా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. విశాఖలోని రుషికొండను ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని.. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రుషికొండను తవ్వొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి కూడా అంతుబట్టని విధంగా రవ్వల కొండను తవ్వేశారని ఆవేదన…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రైతులకు ద్రోహం చేశారని.. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 471 మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వీరందరికీ తమ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిన విషయం వాస్తవమా కాదా అని నిలదీశారు. ఈ…