గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన వ్యక్తిగా సీఎం జగన్ చరిత్రలో…
వైసీపీ ప్లీనరీలో టీడీపీ అధినేత చంద్రబాబు వేలి ఉంగరంలో చిప్ ఉండటంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి బాగోగుల గురించి ఆలోచించే చిప్ మెదడు, గుండెలో ఉండాలి కానీ.. చంద్రబాబు చేతి రింగులోనో, మోకాలిలోనో, అరికాలిలోనో ఉంటే లాభం ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. గుండె, మెదడులోనూ చిప్ ఉంటే.. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని జగన్…
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని…
మంత్రి ఆర్కే రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే.. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టాయి టీడీపీ శ్రేణులు.. దీంతో.. నగరి టౌన్‌లో ఎటు చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ…
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు.. 2024 టార్గెట్‌గానే ఈ ప్లీనరీ ఉంటుందని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
ఒక క్లాస్ కు ఒక టీచర్ కాకుండా కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌కు ఒక టీచర్ విధానం తీసుకుని వస్తున్నాం.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఎడమ చేతి చూపుడు వేలుకు రింగ్ ధరించారు చంద్రబాబు.. ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్ కావడం మరో విశేషం.. ఆ రింగ్‌లో మైక్రో చిప్ అమర్చబడి ఉంటుందని తెలిపారు చంద్రబాబు.