రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిలిచింది. రాష్ట్రం నుంచి వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా... అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా నిలిచింది ఏపీ.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా పర్యాటనలో అపశృతి చోటు చేసుకుంది.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా నీటిలో పడిపోయారు టీడీపీకి చెందిన 15 మంది నేతలు.. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.. మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు.. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడి తడిసి ముద్దయ్యారు.. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. నీటిలో పడినవారిలో పోలీసు…
Chandra Babu Fires on YCP Leaders: ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిపక్షాలు శ్రీలంకతో పోల్చడంపై వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులే ఏపీలో ఉన్నాయని.. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని, తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ…
Kodali Nani Fires on TDP And Janasena: వరదలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడంపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గోదావరి వరద ప్రాంతంలో సీఎం జగన్ పునరావాసం ఏర్పాటు చేశారని కొడాలి నాని వెల్లడించారు. బాధితులకు ఆహారం, నీరు అందించడం సహా కుటుంబానికి రూ.2 వేలు ఇచ్చారన్నారు. వరద ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఒక్కో కలెక్టర్‌కు…
Chandra Babu Fires on AP Government: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. కోవిడ్ నిధులనూ దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమని చంద్రబాబు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించిందని చంద్రబాబు వివరించారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని.. దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమ చెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ ఇష్టానుసార…
YCP MP Vijaya Sai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకోవడంపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని గతంలో చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడని, ఇప్పుడు ఆ ఒట్టు తీసి గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇకపై ఎప్పటికీ సీఎం కాలేనని…