Nirmala Sitharaman: మూడేళ్ళలో ఏపీ అప్పులు ఎన్నికోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతోందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంత అప్పు చేసిందో తెలుసా? కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ అప్పులపై కీలక ప్రకటన చేశారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ తీసుకున్న రుణం మెత్తం 3 లక్షల 7 వేల 671 కోట్ల రూపాయలు అని ఆర్థికమంత్రి తెలిపారు.
2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రుణం మెత్తం 3 లక్షల 60 వేల 333 కోట్ల రూపాయలు. 2021-22 లో అదనంగా తీసుకున్న రుణం సుమారు 53 వేల కోట్ల రూపాయలు అని ఆమె వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ రుణం మొత్తం 3 లక్షల 98 వేల 903 కోట్ల రూపాయలుగా ఆమె వివరించారు. 2022-23 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం వివిధ అవసరాల కోసం అదనంగా తీసుకున్న రుణం 38 వేల కోట్ల రూపాయలుగా ఆమె తెలియచేశారు.
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
CM Jagan Review: ఆదాయం తెచ్చే శాఖలపై జగన్ సమీక్ష
ఏపీలో అప్పులపై ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో చంద్రబాబు హయాం నుంచి ఇప్పటివరకూ అప్పులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.3.80 లక్షల కోట్లుగా ఇటీవల వెల్లడించారు. అయితే, తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేసిందని ఆయన స్పష్టం చేశారు.. ఏపీలో అప్పులు పెరిగినమాట నిజమే.
కానీ, కోవిడ్, ఇతర పరిస్థితుల వల్లే అప్పు పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.34 లక్షల కోట్లుగా అప్పు ఉంటే ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని దువ్వూరి కృష్ణ వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయని వెల్లడించారు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు దువ్వూరి కృష్ణ. టీడీపీ ప్రభుత్వం గతంలో నిబంధనలకు లోబడకుండా అప్పులు చేసిందంటున్నారు వైసీపీ నేతలు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!