Atchannaidu Allegations on AP Government: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. గత మూడేళ్లలో ఏపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని.. దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై డాడులు జరిగాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు ఇలా…
NTR Last Daughter Uma Maheswari: నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కూతురు. ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్. ఉమామహేశ్వరి మరణవార్తను విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. కాగా…
Chandrababu wrotes letter to cs sameer sharma: గోదావరి వరదలతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను, పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని కోరుతూ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి వరదల కారణంగా నాలుగు జిల్లాల్లో వరద బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ సాయం మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చంద్రబాబు కోరారు. గోదావరి…
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కమల్‌హాసన్ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబుకు.. భారతీయుడులో కమల్‌హాసన్ గురించి తెలియదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దుర్మార్గులకు, దుష్టులను, చంద్రబాబు లాంటి 420 గాళ్లను రాజకీయంగా గొంతు కోయడానికి…
Chandrababu Naidu: ఇటీవల గోదావరి వరదలకు పలు లంక గ్రామాల బాధితుల్లో కొందరు ఇంకా నిస్సహాయస్థితిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాతలకు పిలుపునిచ్చారు. వరద బాధితులకు కూరగాయలు, బియ్యం వితరణ చేయాలని దాతలను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలు ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని..…