టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేతలకు క్లాస్ పీకారు. మీకు ఏం చెప్పాను.. మీరేం చేస్తున్నారు.. జనంలోకి వెళ్లమంటే వెళ్లరు.. బాదుడే బాదుడు అనమంటే.. ఈ ఊసే లేదు.. పార్టీ సభ్యత్వ నమోదు చేయండంటే దాని గురించి ఆలోచించరు.. ప్రభుత్వ వైఫల్యాలు ఇన్ని ఉంటే.. మీరు మాత్రం కాలు బయట పెట్టడం లేదు.. ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ మీటింగ్ లో ఆ జిల్లా నేతలకు ఇచ్చిన క్లాస్. మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు.. గ్రౌండ్ లెవల్ నుంచి ఫీడ్ బ్యాక్ ఉంది. ఇక మీరు మారాల్సిన టైం వచ్చిందంటూ గట్టిగానే డోస్ ఇచ్చారు. ఇంతకీ అనంతపురం జిల్లా నేతలకు బాబు ఎందుకంత సీరియస్ క్లాస్ పీకారో తెలుసా?
నేను మారుతాను మారుతానన్న చంద్రబాబు నిజంగానే మారిపోయారు. ఆయన మైండ్ సెట్ బాగా మారిపోయింది. గతంలో కార్యకర్తలు, నాయకులతో ఏ మీటింగ్ జరిగినా.. గంటల తరబడి ఆయన స్పీచ్ ఇచ్చే వారు. ఇది విన లేక.. ఎప్పుడూ చెప్పేదే కదా అనుకునే నేతలే ఎక్కువగా ఉండే వారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మారారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది.. ఏ నేత ఏం చేస్తున్నారో.. ఏనేత పై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం ఏంటన్నది ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎప్పటిలానే బాస్ బాగా పని చేయండి.. ప్రభుత్వ వైఫల్యాల గురించిచెబుతారని ఈ మీటింగ్ ను లైట్ గా తీసుకుని హాజరయ్యారు. మీటింగ్ స్టార్ట్ కాగానే.. ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు ఫుల్ క్లారిటీతో క్లాస్ ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడటం ప్రారంభించిన రెండు నిమిషాలకే నేతలకు అర్థమైంది.. ఈ సారి క్లాస్ గట్టిగానే ఉంటుందని క్లారిటీకి వచ్చారు.
Reliance Jio: రిలయన్స్ జియో దూకుడు.. క్యూ1లో 24 శాతం పెరిగిన లాభాలు
అసలు మీకు ఏం చెప్పాను… ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచేస్తే మీరేం చేస్తున్నారు? బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి ఇళ్లు టచ్ చేయాలని చెప్పానుగా.. ఎంత మంది ఇప్పుడు వరకు ఎన్ని రోజులు ఈ ప్రోగ్రామ్ చేశారు చెప్పండంటూ ఫైర్ అయ్యారు. చాలా మంది నేతలు మొదట రెండు మూడు రోజులు చేయడం, ఆ తరువాత ఎప్పుడో తమకు కుదిరినప్పుడు జనంలోకి వెళ్లడం లేదా.. పార్టీ పిలుపునిచ్చినప్పుడు కనిపించడం ఆ తరువాత ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతున్నారని క్లాస్ పీకారు. ఇది కేవలం ఒకరిద్దరు కాదు జిల్లా నేతలందరి పరిస్థితి ఇలానే ఉంది. మీరు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎప్పుడు జనంలోకి వెళ్లారు.. ఎంత సేపు అక్కడుంటున్నారు.. అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారనే విషయాలపై నాకు పూర్తి స్థాయి క్లారిటీ ఉందని బాబు చెప్పడంతో ఒక్కరి నోటి నుంచి మాట రాలేదు.
అంతే కాదు పార్టీ సభ్యత్వ నమోదు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండాలని చెబితే.. ఒక నియోజకవర్గంలో కూడా మెరుగ్గా ప్రోగ్రెస్ లేదని ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి మీ ప్రాంతంలో విద్యుత్ మీటర్లు అమర్చుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్ గా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై రెగ్యూలర్ గా కార్యక్రమం చేయడంపై ఏ ఒక్కరికీ శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేతలు మానిటర్ చేయాల్సిన ఐదు జిల్లాల కో-ఆర్డీనేటర్ అమర్నాథ్ రెడ్డిని మీరు జిల్లాలకు వెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించాలి కదా అని చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం.
ఇక నేతల మీద గట్టి ఫోకస్ ఉంటుందని.. ఎన్నికల ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాల్సిన నేతలు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశాలు వచ్చిన సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ఇకపై మీరు మారకపోతే.. నేను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సి ఉంటుందనే హెచ్చరిక చేసినట్టు కూడా చర్చ నడుస్తోంది. చంద్రబాబు క్లాస్ తో అలర్ట్ అయిన అమర్నాథ్ రెడ్డి వెంటనే జిల్లాల వారిగా మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా నేతలతో ఆదివారం సమావేశమై అందరి పనితీరు మీద అధినేతకు ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. దీంతో జిల్లా నేతలకు ఈ లోకల్ మీటింగ్ టెన్షన్ పట్టుకుంది.
IND Vs WI: తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్