అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది.. అధికార, ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించడం చర్చగా మారింది.. అయితే, ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్… కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఈ రాష్ట్రంలో ఏ సమస్య దొరకలేదు ఒక గోరంట్ల మాధవ్ ది తప్ప అని ఎద్దేవా చేశారు.. ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయిందని వ్యాఖ్యానించిన ఆయన.. నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో తెలియదన్నారు.
Read Also: WhatsApp New Features: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు.. ఇక, సైలెంట్‌గా..! ఎవరికీ దొరకకుండా..!
ఇదే సమయంలో చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్… ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ట్రాప్ చేశారా..? లేదా ? అనేది త్వరలోనే బయటపడుతుంది.. చంద్రబాబు నాయుడు, లోకేష్, అయ్యన్న పాత్రుడు ట్రాప్ ఏర్పాటు చేశారా..? అనే విషయంలోనూ త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఇక, గోరంట్ల మాధవ్ దోషిగా తేలితే అతను శిక్ష అనుభవిస్తాడు.. లేకపోతే గోరంట్లను ట్రాప్ చేసి ఆ వీడియో చేసిన చంద్రబాబు నాయుడు, లోకేష్, అయ్యన్నపాత్రుడు జైలుకు పోతారంటూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి జోగి రమేష్.