ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది.. ఎంపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. ఇక, విచారణ జరుగుతోందని.. నిజమని తేలితే చర్యలు తప్పవని చెబుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయముడు.. ఓ వెధవ పనిచేసి బహిరంగంగా ఎవ్వరూ తిరగలేరన్న ఆయన.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.. ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
Read Also: Chirag Paswan: నితీష్ కుమార్ విశ్వసనీయత సున్నా.. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి..
ఇక, ముఖ్యమంత్రి అనేవాడు తప్పు చేసిన వారిని మందలించి, దండిస్తే, మిగిలిన వాళ్లకు భయం వస్తుందని వ్యాఖ్యానించారు చంద్రబాబు… సీఎం ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు భూకబ్జాలు లాంటివి పెరిగిపోతున్నాయని ఆరోపించిన ఆయన.. సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నారని విమర్శించారు.. రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దుర్మార్గం అన్నారు చంద్రబాబు.. వీటిని నేను ప్రశ్నిస్తే, గుమస్తాగా పని చేసిన వ్యక్తి కూడా నా గురించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఒక్క ఎన్నికలోనూ గెలవలేని గుమస్తా 7 ఎన్నికల్లో గెలిచిన నా గురించి మాట్లాడతాడా..? అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు. కాగా, ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో రెండు కులాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.. ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితులు నెలకొన్ని విషయం తెలిసిందే.