Prajashanti Party Chief K.A. Paul Fired on Political Leaders.
రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులు అంటూ విమర్శలు గుప్పించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా చేసిన వ్యక్తులు అంతా రాయలసీమ వాసులే అన్నారు. రాయలసీమను రాక్షససీమగా మార్చారు రాజకీయ నాయకులు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాడే,వైఎస్ఆర్, జగన్ కడప జిల్లా వాళ్ళు.. అక్రమ కుటుంబ, కుల రాజకీయాలు చేస్తున్నారు.. కమ్మ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు.. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోంది.. గత వారం రోజులుగా లేని స్టోరీలు నాపై సృష్టించారు.. వెహికల్స్ కు బిల్లు కట్టలేదంటూ ప్రచారం సాగుతోంది.. చంద్రబాబు మా బి ఫార్మ్స్ దొంగలించారు.. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతాడు.. నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చి స్వామి వారి పాదాల వద్ద హామీలు ఇచ్చారు.. ఎన్నికలు అయ్యాక స్వామి వారినే మోసగించారు.. పాలకులు మనల్ని మోసగించి, ఏపీని సుడాన్, శ్రీలంక, నైజిరియా చేస్తున్నారు.. నరేంద్ర మోడీ 120 సార్లు నాకు పూల మాల వేశారు.. చంద్రబాబు, కెసిఆర్ ఇతర రాజకీయ ప్రముఖులు మాకు పాద పూజ చేసారు.. చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి.. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది.
కేసీఆర్ కుటుంబ పాలన, దుష్ట పాలన, అధర్మ పాలన చేస్తూ ఆంధ్రులను దూషిస్తున్నారు.. చాలా సార్లు కేసీఆర్ నా పాదాలు తాకి పాదపూజ చేసారు.. రాష్ట్రాలు భ్రష్టు పట్టడానికి రాజకీయ నాయకులే కారణం.. కాకినాడలో నా కార్లు సీజ్ అయ్యాయని దుష్ప్రచారం.. కోట్ల రూపాయలు అప్పు వాళ్ళ సీజ్ చేసారని చెప్పారు.. ఏపీ, తెలంగాలో అధికారంలోకి రాబోయేది ప్రజాశాంతి పార్టీ నే.. ప్రజలు ఆదరిస్తున్నారు, సినీ యాక్టర్ల కన్నా నాకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.. చంద్రబాబు, జగన్, కెసిఆర్, కాంగ్రెస్ కుటుంబ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం.. ఓట్లు అన్ని ప్రజా శాంతి పార్టీకే వెయ్యండి.. కర్రలతో కలసిన గుడిసెలో ఉంటాను అమెరికాలో.. ఇక్కడ 5 స్టార్ హోటల్ లో ఒక్క స్టార్ కూడా లేదు.. ఇక్కడ ఓ మంచి మహిళను సీఎం చేస్తా, తెలంగాలో నేను సీఎం అవుతా.. మాటలు రాని నా కొడుకుని సీఎం చేస్తా.. నేను పీఎం అవుతా అని 2019 ఎన్నికల్లో చంద్రబాబు విర్రవీగాడు అంటూ మండిపడ్డారు కేఏ పాల్.