Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై…
అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్… అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధానిగా పేర్కొన్న ఆయన.. మూడు రాజధానులపై కొత్త బిల్లుతో వస్తాం అన్నారు.. వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి… హైదరాబాద్ అభివృద్ధి నేనే శిల్పినని చంద్రబాబు చెప్పుకోవడం చూస్తే కులీకుతుబ్ షా ఉరేసుకుంటాడని సెటైర్లు వేసిన…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొడుతోంది చంద్రబాబేనని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన ఖర్మ అన్నారు. గత 60 ఏళ్ళుగా గురువులను పూజించుకోవటం ఆనవాయితీగా వస్తోందని.. ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి గురువులను స్మరించుకుంటూ ఉంటారని.. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సత్కరించారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని.. ఆయన…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు.. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ అద్భుతమైన…
Chandra Babu: ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. వినాయక చవితి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదని చంద్రబాబు పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ఏకం చేసి.. వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని.. అటువంటి గణేష్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా…
టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి నిదర్శనం కుప్పం.. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయింది.. ఆయన జెండాను, పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్… 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఏ వర్గానికి అయినా మేలు చేశాడా..? అని ప్రశ్నించిన ఆయన.. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు మాకు చంద్రబాబు ఏమీ చేశాడు అని ప్రజలు తిరుగుబాటు చేశారు.. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం…
Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. అభివృద్ధి చేసుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. కోల్లుపల్లెలో వైసీపీ నేతలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని.. వైసీపీ జెండాలను కట్టెలతో తొలగించింది టీడీపీ వాళ్లేనని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వీడియోలు చూపించారు. 33 ఏళ్ళలో ఎన్నిసార్లు…