అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్… అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధానిగా పేర్కొన్న ఆయన.. మూడు రాజధానులపై కొత్త బిల్లుతో వస్తాం అన్నారు.. వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి… హైదరాబాద్ అభివృద్ధి నేనే శిల్పినని చంద్రబాబు చెప్పుకోవడం చూస్తే కులీకుతుబ్ షా ఉరేసుకుంటాడని సెటైర్లు వేసిన ఆయన.. గాడిదకు కొమ్ములు వచ్చిన… ముసలోడికి పిచ్చివచ్చిన భరించడం కష్టం.. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Read adlso: Pawan Kalyan: ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి.. నేతాజీ అస్థికలు కూడా తెప్పించండి..
ఇక, హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు వల్లే అయితే.. తెలంగాణలో టీడీపీ మనుగడ ఎక్కడ..? ఉంది అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్… ఎన్టీఆర్ భవన్, అందులో ఉన్న వాచ్ మెన్ తప్ప చంద్రబాబుకు అక్కడ ఎటువంటి పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమరావతి అనేదే ఒక వివాదం… అక్కడ పేదవాళ్ళను చంపి పెద్దలకు మేలు చేసింది నిజం కాదా…? అంటూ నిలదీశారు. చంద్రబాబు.. గుంటూరు, విజయవాడకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఓటు, సీటు, గుర్తించే కార్యకర్తలేని.. డస్ట్ బిన్ లీడర్లను చంద్రబాబు పక్కన పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, సీఆర్‌డీఏ చట్టం- 2014 సెక్షన్ 41(1)లో సవరణను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈ సవరణల ద్వారా సీఆర్డీఏ పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు, రైతులు ఇచ్చిన భూములు రాజధాని వెలుపల వారికి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మాస్టర్ ప్లాన్ లో సవరణలు చేయడానికి మరో సవరణ తెచ్చింది సర్కార్.. సెక్షన్ 41(4) ప్రకారం అభివృద్ధి ప్రణాళికల గెజిట్‌లో సవరణలు చేసి.. వాటిని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చు. అమరావతికి బయటి ప్రాంతాలవారికి సైతం ఇక్కడ ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడానికి వీలుగా సవరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.