కుప్పం తన చేతిలోంచి జారిపోతుందని చంద్రబాబుకు భయం పట్టుకున్నట్లు ఉందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 33 ఏళ్లుగా కుప్పం శాసనసభ్యుడిగా ఉన్న ఆయన.. ఈ మధ్యే కుప్పం వెళ్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో చంద్రబాబుకి గెలుపే లేదన్నారు.
Budda Venkanna: కుప్పంలో చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకునే యత్నం నిరసిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. వైసీపీ అజెండా అమలు చేసే పోలీసుల్ని చొక్కాలు ఊడతీసి కొడతామని హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబాన్ని అంతమొందించే లక్ష్యంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులందరూ వైసీపీ యూనిఫామ్…
Minister Roja: రాజమండ్రిలో శుక్రవారం నాడు పర్యాటక శాఖ మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి చంద్రబాబులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని.. చంద్రబాబు ఫోటో…
లక్ష్మీపార్వతి అడిగారనో.. నేను అడిగాననో.. జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోరన్నారు కొడాలి నాని.. ఆయనకి అవకాశం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు, తీసుకోగలను అనుకున్నప్పుడు.. తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా తీసుకుంటారని.. దానికి తొందరెందుకు అని వ్యాఖ్యానించారు.
వైసీపీ విముక్త ఏపీ అని అంటున్నారు.. అంటే పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం ఏమీ ఉండకుండా చేయటమే తన లక్ష్యం అని చెప్పినట్టే అన్నారు.. ఇలా తెలిసే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారో... ఎవరైనా చెబితే చేస్తున్నారో? అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. బుధవారం నుంచి పలు చోట్ల టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు, దాడులకు దారి తీసింది.. ఇక, ఇవాళ అన్నా క్యాంటీన్ ధ్వంసం, బంద్కు వైసీపీ పిలుపుతో మరింత టెన్షన్ నెలకొంది.. ఇక, కుప్పంలో టీడీపీ నేతలపై భారీగా కేసులు నమోదు చేశారు పోలీసులు.. రామకుప్పం మండలంలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.. మాజీ ఎమ్మెల్సీ…