ఈ రోజు రెబెల్ స్టార్‌ని కోల్పోవడం బాధేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణంరాజు భౌతికకాయం వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. ఆయనకు జబ్బుతో పాటు వయసు కూడా సహకరించడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ తమపై అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌కు 40 ఏళ్లు కూడా ఉండవని.. ఆయనకు తాము కొడుకులం ఎలా అవుతామని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. లోకేష్ ఒక లుచ్చా అని.. ఆవు చేలో మేస్తే.. దూడ కూడా చేలోనే మేస్తుందని.. చంద్రబాబు గడ్డి తింటున్నారు కాబట్టి…
Lakshmi Parvathi: చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అంటూ సుప్రీంకోర్టు ఆమెను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. తన కేసులో ఒకరి ఆస్తుల గురించి ప్రశ్నించడానికి తానెవరు అని అత్యున్నత నాయస్థానం ప్రశ్నించిందని.. అయితే జగన్ ఆస్తుల కేసులో శంకర్రావు ఎవరు అని…
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబు జగన్‌పై విమర్శలు చేస్తున్నాడని.. హైదరాబాద్‌ను నిర్మించడం ప్రారంభించింది తానేనని చెప్పుకుంటున్నాడని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. 1995లో చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత హైదరాబాద్‌ను నిర్మించడం ప్రారంభించాడట.. దానిని వైఎస్ఆర్ కొనసాగించారట అంటూ ఎద్దేవా చేశారు. భ్రమరావతి పేరుతో చంద్రబాబు సృష్టించిన గ్రాఫిక్స్‌ను జగన్ కొనసాగించాలా అని…
Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై…
అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్… అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధానిగా పేర్కొన్న ఆయన.. మూడు రాజధానులపై కొత్త బిల్లుతో వస్తాం అన్నారు.. వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.. మరోవైపు.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి… హైదరాబాద్ అభివృద్ధి నేనే శిల్పినని చంద్రబాబు చెప్పుకోవడం చూస్తే కులీకుతుబ్ షా ఉరేసుకుంటాడని సెటైర్లు వేసిన…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొడుతోంది చంద్రబాబేనని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన ఖర్మ అన్నారు. గత 60 ఏళ్ళుగా గురువులను పూజించుకోవటం ఆనవాయితీగా వస్తోందని.. ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి గురువులను స్మరించుకుంటూ ఉంటారని.. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సత్కరించారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని.. ఆయన…