Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారని.. అయినా చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విడదల రజినీ వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు త్వరలో మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే…
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. దీంతో చంద్రబాబు పని ఐపోయింది.. అమరావతి విషయంలో భూ భాగోతం బయట పడిందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి...
Gudivada Amarnath: ఏపీ రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో అసెంబ్లీలో ఈ అంశంపై బిల్లు కూడా పెడతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమకు సవాళ్లు విసరడం దేనికి అని.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పగానే…
ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి... ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు.. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతుంది..
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు రెఫరెండంగా వచ్చే ఎన్నికలకు వెళ్లామంటున్న వైసీపీ ప్రభుత్వం.. దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేయాలని టీడీఎల్పీలో నిర్ణయించారు. జగన్కు అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసిరింది. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు…