Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్నది అభియోగం.
చంద్రబాబు-పవన్ కలుస్తారు అని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.. అదే జరుగుతుందన్న ఆయన.. రాష్ట్రంలో సమస్యలు ఉంటే ఎవరైనా చెప్పుకుంటారు.. పవన్ కల్యాణ్‌కి ఏమైనా సమస్యలు ఉంటే ఆయనే ప్రశ్నించవచ్చు అన్నారు మంత్రి బొత్స
అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
KVP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రాణమిత్రుడు కేవీపీ రామచంద్రరావు ‘పోలవరం-ఓ సాహసి ప్రయాణం’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సదరు పుస్తకంలో కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకుల గురించి అందులో కూలంకుషంగా చర్చించారు. డెల్టా ప్రాంతాలకు, రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులకు నీటిలభ్యత లేకపోవడమే కారణమని ఆనాడు వైఎస్ఆర్ ఆలోచించారని.. అందుకే ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం…
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు…
Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హంతకుడు, దగాకోరు, వెన్నుపోటు దారుడు చంద్రబాబు అని అందరికీ తెలుసన్నారు. రెండు ఎకరాల నుంచి ఇంత ఆస్తిని చంద్రబాబు ఎలా సంపాదించారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సంగతి తెలిసే ఆయన నీచ చరిత్రకు ప్రజలు చరమగీతం పాడారని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుంటే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సామాజిక విప్లవకారుడిలా జగన్ సామాజిక…
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ…