అమరావతి రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది.. తాజాగా, అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా…
VijayaSai Reddy: వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు ఓడిస్తే అవే తనకు చివరి ఎన్నికలంటూ కర్నూలు పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తూ చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. తనకు కాలం చెల్లిందని చంద్రబాబు స్వయంగా అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ…
ఏపీలో ఎన్నికలకు 17 నెలల వరకూ గడువు వుంది. అయితే, అధికార పార్టీ మాత్రం ఎన్నికలకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. 175 సీట్లే లక్ష్యంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రోడ్ షోలు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నన్నూరు మీదుగా కర్నూలు బైపాస్, బళ్లారి చౌరస్తా, పెద్దపాడు, కోడుమూరు, కరివేముల, దేవనకొండ, దూదేకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకు పత్తికొండకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటలకు పత్తికొండలో బహిరంగ సభలో…