జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు-పవన్ కలుస్తారు అని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.. అదే జరుగుతుందన్న ఆయన.. రాష్ట్రంలో సమస్యలు ఉంటే ఎవరైనా చెప్పుకుంటారు.. పవన్ కల్యాణ్‌కి ఏమైనా సమస్యలు ఉంటే ఆయనే ప్రశ్నించవచ్చు అన్నారు.. కానీ, పవన్ లాగా వచ్చి అసభ్యంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? అని నిలదీశారు.. ఇక, రాజకీయ పార్టీలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు.. ప్రభుత్వ సంక్షేమంపై జనసేన సోషల్ ఆడిట్ చేసుకోవచ్చు.. ప్రజలే చెబుతారు… జన్మభూమి కమిటీల్లా ఉందా? లేక పారదర్శకంగా జరుగుతుందా? అనేది అంటూ సవాల్ చేశారు.. నిన్న మేం మాట్లాడినప్పుడు పవన్‌ని విమర్శించామా? అని ప్రశ్నించారు మంత్రి బొత్స.. కాపులకు మేం చేసిన అభివృద్ధి చెప్పడానికి మీటింగ్ పెట్టుకున్నామన్నారు.
Read Also: Munugode Bypoll: ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం
మరోవైపు, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావు అని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ.. ఐదేళ్ల కోసం ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.. ఆ తర్వాత ఇంకో ఐదేళ్లు కూడా ఇస్తారన్నారు.. ఇక, జనవాణి 26 జిల్లాలు కాకపోతే 56 జిల్లాలో పెట్టుకోమనండి.. అంతేకాదు.. పక్కన ఉన్న ఒడిశాలో కూడా పెట్టుకోమనండి…. మేము వద్దు అన్నామా? అంటూ సెటైర్లు వేశారు.. మా మంత్రుల పై దాడి చేశారు… కానీ, పవన్ కల్యాణ్‌పై దాడికి కుట్ర అనటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.. ఇక, అమరావతి రైతుల పాదయాత్రపై స్పందిస్తూ.. రైతుల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న యాత్ర.. అది టీడీపీ యాత్ర… ఇంకా రైతుల ముసుగు ఎందుకు? అని నిలదీశారు మంత్రి బొత్స సత్యనారాయణ.