కర్నూలు రోడ్ షోలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. చంద్రబాబుకే కాదు టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలు అన్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని మంత్రి అన్నారు. ఎవర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు??చంద్రబాబు పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదు. తులసి నీళ్ళు పోస్తేనే బ్రతుకుతాను అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
Read Also: Attack On Tdp Leader: తునిలో దారుణం.. టీడీపీ నేతపై కత్తితో దాడి
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి చేశాడు? చంద్రబాబు క్రికెట్ టీం లో కోహ్లి లాంటి వాడు కాదు కదా. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్స్‌ట్రా ప్లేయర్. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాలన్నారు. అలా చెప్పలేకపోతే 2024 ఎన్నికలే చంద్రబాబు చివరి ఎన్నికలు అవుతాయి. అధికారం కోసం భార్యను కూడా బజారుకు లాగుతున్నాడని విమర్శించారు మంత్రి అమర్నాథ్.
కర్నూలు టూర్ లో చంద్రబాబు ఎమోషన్ అయిన సంగతి తెలిసిందే. మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపకపోతే ఇవే తనకు చివరి ఎన్నికలన్నారు చంద్రబాబు. ఆయన కామెంట్లపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. చంద్రబాబునాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు మరో మంత్రి సీదిరి అప్పలరాజు. తనకు ఇవే చివరి ఎన్నికలన్న కామెంట్లపై ఘాటుగా స్పందించారు. జగన్ ని చంద్రబాబు ఏం పీకగలరన్నారు.
Read Also: Minister Sidiri Appalaraju Press Meet Live: మంత్రి సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్