కర్నూలు జిల్లా పర్యటనలో ఇక నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి.. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇక, చంద్రబాబు కామెంట్లపై స్పందించిన ఉషశ్రీ చరణ్.. వంచనకు మరోపేరు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందే చేతులెత్తేశారని.. అందుకే ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వైఖరి అందితే జుట్టు అందకపోతే కాళ్లు అని మండిపడ్డ ఆమె.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు గుడ్ బై చెప్పనున్నారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు జెండా, అజెండా రెండూ లేవు అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందనే చంద్రబాబులో ఫ్రస్టేషన్‌లో ఉన్నారని విమర్శించారు. 2014-19లో కురుబా (కురుమ) వర్గానికి ఎందుకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు? అని ప్రశ్నించారు.. ఇప్పుడే కురుబా వర్గం చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు వస్తోందని మండిపడ్డారు మంత్రి ఉషశ్రీ చరణ్.
మరోవైపు, డ్వాక్రా సంఘాలు మన దేశంలో మొదటి సారి 1982లో ఏర్పడ్డాయి.. టీడీపీ పెట్టక ముందు నుంచే డ్వాక్రా సంఘాలు ఉంటే.. చంద్రబాబు మాత్రం తానే ఈ సంఘాలను తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని సెటైర్లు వేశారు మంత్రి ఉషశ్రీ చరణ్… విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తన పేరు ప్రస్తావించారని చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.. ఇక, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతిగా పేర్కొన్నారు. ఇళ్ల విషయంలో అబద్దాలు ప్రచారం చేయాలని జనసేన చేసిన ప్రయత్నాన్ని మహిళలే తిప్పికొట్టారని తెలిపారు మంత్రి ఉషశ్రీ చరణ్. కాగా, ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు ప్రకటించిన తర్వాత.. వరుస పెట్టి రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు.. చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబు పని అయిపోయిందని.. ఇక, ఈ ఎన్నికల్లో ఆయన్ను కాపాడేవాడే లేరని వ్యాఖ్యానిస్తున్నారు.