ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. డిసెంబర్ 5వ తేదీన హస్తినకు వెళ్తారు సీఎం జగన్.. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకానున్నారు వైసీపీ అధినేత.. డిసెంబర్ 1వ తేదీ 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ- 20 దేశాల కూటమికి అధ్యక్షత వహించనుంది భారతదేశం.. ఈ నేపథ్యంలో భారత్ లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై…
ఏడ్చే మగాడిని.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.. అంటే, ఏడుపు అనేది మగవాని స్వభావానికి విరుద్ధం.. అదే విధంగా నవ్వు అనేది సామాన్య స్త్రీ స్వభావానికి విరుద్ధమట.. అందుకే ఈ సామెత వచ్చిందంటారు.. అయితే, ఈ సామెతను చెబుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేస్తూ హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. ఏడ్చే మగాడిని నమ్మకపోవడం మన సంస్కృతి.. ఆంధ్ర ప్రజలు ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో…
ChandraBabu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. డిసెంబర్ 1,2022 నుంచి నవంబర్ 30,2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది. భారత్‌లో నిర్వహించే జీ20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్…
రాజకీయాలు చెడిపోయాయి.. లాస్ట్ ఛాన్స్ అంటూ వస్తున్నవారికి మరో ఛాన్స్ ఇవ్వొద్దని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు.. పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్, ఎంజీఆర్, వైఎస్ జగన్ అంటారన్న ఆయన.. పిల్లను ఇచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కునేవారిని చంద్రబాబు అంటారంటూ ఎద్దేవా చేశారు.. తమ…
విశాఖను రాజధానిని చేస్తే టీటీడీ అధినేత చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? తెలంగాణలో బిజినెస్‌లు చేస్తూ హైదరాబాద్‌లో ఉంటాడు.. మాకు విశాఖ రాజధాని వద్దంటారు అంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో రైతుల భూ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకురావడంతోనే శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం తీసుకువచ్చామన్నారు.. కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరిగి ప్రజలు…
Kodali Nani: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీడీపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా, ఆయన పుత్రరత్నం లోకేష్ పోటీ చేసినా వైసీసీ అభ్యర్థిగానే తానే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, కుల సంఘాలు వచ్చిన అరిచి గోల చేసినా తన గెలుపును…
Kakani Govardhan Reddy: ఏపీలో తెలుగుదేశం పార్టీ తాజాగా వైసీపీ ప్రభుత్వ విధానాలను ఆరోపిస్తూ ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని.. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని అర్థం అవుతోందని మంత్రి కాకాణి అన్నారు. కర్నూలు పర్యటనపై చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నారని.. కర్నూలులో న్యాయ రాజధాని విషయంలో…