మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే పుంగనూరులో గొడవ జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు పర్యటనలో ప్రసంగించిన తీరు వివాదస్పదంగా మారింది అని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కామెంట్స్.. ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. పుంగనూరు పర్యటనలో మాటలతో మొదలైన వివాదం చివరకు కొట్టుకునే స్థాయికి చేరింది అని మంత్రి తెలిపారు.
Read Also: PM Modi: ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశం.. గెలుపు సూత్రాలు ప్రకటన
అయితే, పుంగనూరు పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన పదజాలం, ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన కామెంట్స్ విన్నవారికి చంద్రబాబు సహనాన్ని కోల్పోయారా? అన్నట్లు ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని మంత్రి బొత్స అన్నారు. చంద్రబాబు అల్లర్లు సృష్టించడం దుర్మార్గపు చర్య, నువ్వు అందరిలానే ఒక నాయకుడివే అనే విషయాన్నీ మర్చిపోవద్దు, నువ్వేమన్న పుడింగివనుకుంటున్నావా?.. అల్లర్లు సృష్టించడం రాజకీయంగా మంచి సంస్కృతి కాదు అని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలని రెచ్చగొట్టి, పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అల్లర్లు సృష్టించిన చంద్రబాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also: Tamilnadu: ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశంపై నిరాకరణ.. హైకోర్టు సీరియస్
ఇక, పుంగనూరు ఘటనను మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు రెచ్చగొడితే నీ బుద్ధి ఏమైందని చంద్రబాబుని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎస్‌పీజీ రక్షణ కలిగిన నేత ఎటు వెళ్తున్నారో ముందుగా చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. పుంగనూరు ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని మంత్రి అన్నారు. పుంగనూరు ఘటనకు కారణమైన చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.