టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలుచేశారు ఏపీ మంత్రి జోగి రమేష్… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్ 1న తాను మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు. వెన్నుపోటు పొడిచిన రోజును పండుగ చేసుకోవడానికి చంద్రబాబుకు సిగ్గు ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి.. ఊరు, వాడ, ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ వైఎస్ను గుర్తుకు తెచ్చుకునే రోజు.. ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే వైఎస్ పాలన…