Vijayasai Reddy Fires On Chandrababu Naidu Over Macherla Violence: టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అధికారంలో లేకపోతే.. గుడులు, బడుల్ని సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుదని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే.. బాబు తనలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ట్రానికే ఖర్మ అంటూ ధ్వజమెత్తారు. మాచర్లలో జరిగిన ఘర్షణని ఉద్దేశించి.. ఈ విధంగా ట్విటర్ మాధ్యమంగా విజయసాయిరెడ్డి స్పందించారు.
Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా
‘‘ఎన్నికలు సమీపిస్తుండడంతో మా చంద్రం అన్నయ్య తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టుకుంటున్నాడు. మాచర్లను మండించాడు. ఎచ్చెర్లలో ఏంచేస్తాడో? వీధుల్లో కుక్కల్లా టీడీపీ రౌడీలు స్వైరవిహారం చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ! తాను అధికారంలో లేకపోతే చాలు.. గుడులు, బడులను సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుది. తానే కక్షలు, కార్పణ్యాలు రగిల్చి.. మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆరోపిస్తుంటాడు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం.. మన రాష్ట్రానికే ఖర్మ’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Ram Gopal Varma: ఆ సెక్స్ సినిమా నా కొడుకుతో కలిసి చూశా.. వర్మ తల్లి షాకింగ్ కామెంట్స్
అంతకుముందు కూడా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారని విజయసాయి రెడ్డి ట్విటర్ మాధ్యమంగా ఆరోపణలు చేశారు. అమరావతిని అంగీకరించాలంటూ ఉత్తరాంధ్రలో ఘర్షణలు లేపాలని చూశారని.. కానీ ఆ ప్లాన్ ఫ్లాప్ అయ్యిందని చెప్పారు. కర్నూలుకి వెళ్లి తనే రెచ్చగొట్టే యత్నం చేశారన్నారు. మీరు కడుపు మాడ్చుకొని, మాకు కమ్మని భోజనం వడ్డించండి అన్నట్టుంది చంద్రబాబు వాలకమని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో మా చంద్రం అన్నయ్య తనలోని రాక్షసత్వాన్ని బయట పెట్టుకుంటున్నాడు. మాచర్లను మండించాడు. ఎచ్చెర్లలో ఏం చేస్తాడో? వీధుల్లో కుక్కల్లా టీడీపీ రౌడీలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాష్ట్రానికి వీరేం ఖర్మ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 18, 2022
తాను అధికారంలో లేకపోతేచాలు… గుడులు, బడులను సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుది. తానే కక్షలు కార్పణ్యాలు రగిల్చి మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆరోపిస్తుంటాడు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడు – ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రానికే ఖర్మ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 18, 2022