Ambati Rambabu Counter Attack On Pawan Kalyan: తనపై జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా స్పందించారు. తాను రెండు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టు పవన్ నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి వెళ్లిపోతానని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో గతంలో పవన్ చేసిన వాగ్ధానాన్ని కూడా తిరిగి తెరపైకి తీసుకొచ్చారు. 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పవన్ చెప్పాడని, మరి అది ఏమైందని నిలదీశారు.
Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా
సత్తెనపల్లిలో పవన్ వైసీపీపై విమర్శలు చేసినట్లు కనిపించినా.. ఆయన ఇచ్చిన సందేశం వేరని అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వెళ్తానని.. బీజేపీకి పవన్ డైరెక్ట్‌గా మెసేజ్ పంపించారని అన్నారు. చంద్రబాబును గెలిపించటానికి తాను గాడిదలా మోస్తానని, మీరు కూడా నాలాగే గాడిదలా చంద్రబాబుని గెలిపించే బరువును మోయమని అంటున్నాడని, ఈ వ్యూహాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్‌కు చాలా మందితో విడిపోవటం అలవాటుందని ఎద్దేవా చేశారు. అధికారం రాని కులాలకు అధికారంలోకి తీసుకుని రావటమే జనసేన లక్ష్యమని పవన్ చెప్పారని.. మరి ఆయన ఇదే మాట మీద ఉంటాడా? లేకపోతే చంద్రబాబు దగ్గర పదో, పరకో తీసుకొని పొత్తులతో సర్దుకుంటాడా? అని ప్రశ్నించారు.
Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా
పవన్ కాపుల శని అని, పోలవరం పూర్తి చేయనంత మాత్రాన తాను మంత్రిని కానా? అని అంబటి రాంబాబు నిలదీశారు. మరి.. 2018లో చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చాడు? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావా? అని సందేహం వ్యక్తం చేశారు. నీ జామకాయ నీ ఇష్టమని, కాపులందరినీ గాడిదల్ని చేయకని సూచించారు. వారాహి అని కాకుండా వాహనం పేరు పంది అని పెట్టుకోమనండని మండిపడ్డారు. కౌలు రైతులను గుర్తించింది తమ ప్రభుత్వమేనని.. గుర్తింపు కార్డ్ ఉండి, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రూ. 7 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామన్నారు. జనసేన రూ. 1 ఇచ్చిన వారు.. గుర్తింపు కార్డ్ ఉన్న కౌలు రైతులు కాదని పేర్కొన్నారు.