Minister Roja Satires On Pawan Kalyan Nara Lokesh: ఏపీ మంత్రి రోజా మరోసారి పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లపై సెటైర్లు వేశారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ.. పవన్‌ని చూస్తే వొడాఫోన్ యాడ్ గుర్తుకు వస్తోందని, చంద్రబాబు ఎక్కడుంటే పవన్ అక్కడుంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎప్పుడూ ఏ షోకి వెళ్లని పవన్.. ఇప్పుడు బాలయ్య షో (అన్‌స్టాపబుల్)కి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించాడు. గతంలో పవన్ అభిమానుల్ని బాలయ్య ఎంతో దారుణంగా తిట్టారని గుర్తు చేశారు. బాలయ్య షోకి వెళ్తే పవన్‌కి ప్యాకేజీ వస్తుందని, ఆయన అభిమానులకి తిట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇక లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. అది యువగళమా? నారాగళమా? అని అననుమానం వ్యక్తం చేశారు. ఈ యాత్రతో లోకేష్ ఏం సాధిస్తాడన్నారు. కరోనా సమయంలో తండ్రికొడుకులు దాక్కున్నారని, రాష్ట్రాన్ని అప్పలుపాలు చేసిచ్చారని ఆరోపించారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మా కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని.. అసలే ఏం చేశాడని లోకేష్ పాదయాత్రలో తిరుగుతాడని నిలదీశారు. డిక్కి బలిసిన కోడి చికిన్ షాపు ముందు తోడ కొట్టడం.. లోకేష్ పాదయాత్ర చేయడం రెండూ ఒకటేనని కౌంటర్లు వేశారు. పెన్షన్ రద్దు అంటూ ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ వస్తుందని రోజా వెల్లడించారు.
Jagan – Bhupendra Yadav: కేంద్రమంత్రి భూపేంద్రతో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలివే
ఇదే సమయంలో మంత్రి మేరుగ నాగార్జున కూడా నారాలోకేష్ పాదయాత్రపై స్పందించారు. నారా లోకేష్ యాత్రను తాము పల్లెపల్లెల్లో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఛాలెంజ్ చేశారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానించారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కును నేలకు తాకాలని, లేదంటే పాదయాత్రను అడ్డుకుని తీరుతామని అన్నారు. విశాఖలో త్వరలోనే రాజధాని ఏర్పాటవుతుందని.. వీలైనంత త్వరగా విశాఖలో రాజధాని కార్యాకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. చంద్రబాబు రాయలసీమవాసీగా కర్నూలును రాజధానిగా అంగీకరించి, ఓట్లు అడగాలన్నారు.
Jagan – Modi: ప్రధాని మోడీతో భేటీలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే