Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సమావేశాలు వరుసగా వాయిదా.. ఐసీసీ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ
- వరుసగా వాయిదా పడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025..
- నేటి భేటీలో పాక్ క్రికెట్ బోర్డుకు హైబ్రిడ్ మోడల్ ఆప్షన్ ఇచ్చిన ఐసీసీ..
- తటస్థ వేదికకు పాక్ ఒప్పకోకపోతే ఆతిథ్య హక్కులను వేరే దేశానికే ఇచ్చే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన వరుసగా వాయిదా పడుతూనే ఉంది. నవంబర్ 29న షెడ్యూల్ విడుదల చేస్తారని అందరు అనుకున్నారు. కానీ, మరుసటి రోజుకు భేటీ వాయిదా పడింది. దీంతో ఆ రోజు జరగాల్సిన ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భేటీ కూడా జరగలేదు. ఇక, అది ఇవాళ (డిసెంబర్ 5కి) జరిగిన సమావేశం మరోసారి వాయిదా పడింది. అయితే, మరోసారి ఐసీసీ సమావేశాన్ని రెండు రోజులకు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 7న మీటింగ్ జరగనున్నట్లు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి భేటీ కావడంతో అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సమావేశం వాయిదా పడటం గమనార్హం.
Read Also: Devendra Fadnavis: సీఎంగా ఫడ్నవిస్ తొలి సంతకం.. దేనిపై చేశారంటే..!
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే, పాకిస్థాన్ ఆతిథ్యంలోనే వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సింది. కానీ, పాక్‌కు వెళ్లి ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. భద్రతా కారణాలతో అక్కడికి టీమిండియాను పంపించమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పీసీబీని హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోవాలని ఐసీసీ ఓ ఆఫర్ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు పీసీబీ ఏ విషయం చెప్పలేదు. ఇవాళ జరిగిన బ్రీఫ్ సెషన్‌లోనూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందు ఇదే ఆప్షన్‌ను మరోసారి ఐసీసీ ఉంచినట్లు సమాచారం. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మాత్రం ఆతిథ్య హక్కులను జైషా నేతృత్వంలోని ఐసీసీ మరో దేశానికి ఇచ్చేయడం ఖాయమని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పుడు ఆర్థికంగా పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!