Champions Trophy 2025: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకు వచ్చి జట్టులోని సభ్యుల వివరాలను వెల్లడించనున్నారు. అయితే, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐసీసీ టోర్నమెంట్లో ఆడడంపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు తెర పడింది.
Read Also: Lakshmi Parvathi: సీఎం చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్!
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో బుమ్రాను చేర్చేందుకు బీసీసీఐ రెడీగా ఉందని సమాచారం. కాగా, సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా ఆ తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఆడతాడా లేదా అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ, బుమ్రా తన గాయంంపై వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
Read Also: Pro-Pakistan Slogan: సోషల్ మీడియాలో పాక్ అనుకూల నినాదాన్ని పోస్ట్ చేసిన యూపీ వ్యక్తి అరెస్ట్
అయితే, బుమ్రాను తుది జట్టులోకి తీసుకుంటారు.. కానీ, టోర్నీలో పాల్గొనడం అనేది మాత్రం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడింది. సెలక్టర్లు బుమ్రా ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కనీసం ఒక మ్యాచ్ ఆడాలని కోరినట్లు తెలుస్తుంది. ఇక, సంజూ శాంసన్ కు జట్టులో చోటు దక్కించుకోలేకపోతాడని సమాచారం. ఎందుకంటే, సంజూకి ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20లో చోటు దక్కించుకున్నప్పటికీ.. వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడ్ని ఎంపిక చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు.
Read Also: Transport Deportment: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝళిపించిన రవాణా శాఖ
అయితే, జాతీయ జట్టుకు ఆడాలనుకునే ప్లేయర్స్ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని నిబంధనను బీసీసీఐ తీసుకొచ్చింది. కానీ, సంజూ శాంసన్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడంతో సెలక్టర్లు అతని గైర్హాజరుపై సంతోషంగా లేరని తెలుస్తుంది. అలాగే, దేశవాళీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కరుణ్ నాయర్ ను జట్టులోకి తీసుకునేందుకు సెలక్షన్ కమిటీ యోచిస్తుంది. ఇప్పటి వరకు అతడు వీహెచ్‌టీలో 8 మ్యాచ్‌ల్లో 752 రన్స్ చేశాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు నమోదు చేశాడు.