గురు పౌర్ణమి సందర్భంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గోశాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను పూర్తి చేసి ముందుకు వెళ్తున్నామని.. ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు.. సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించానని తెలిపారు.
Chaganti Koteswara Rao : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ అధికారిక కార్యక్రమంలో ప్రముఖ ధార్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా జరిగిన సభలో చాగంటి ప్రసంగిస్తున్న సమయంలో, వేదికపై అభిమానులు, నాయకులు గుంపులుగా చేరి ఫోటోలు తీయడం ప్రారంభించడంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ…
తనను మర్యాదపూర్వకంగా కలిసి చాగంటి కోటేశ్వరరావును సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక సూచనలు చేశారు.. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సన్మానించిన సీఎం చంద్రబాబు.. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి.. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి అంటూ చాగంటి కోటేశ్వరరావుకు సూచించారు..
Chaganti Koteswara Rao: ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి కట్టబెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. చాగంటిని టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించింది.. ఈ మేరకు హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి.. ఆ తర్వాత సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాతో పంచుకున్నారు వైవీ…
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్యకుమారి పాల్గొన్నారు. నవంబర్ 30న గురజాడ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.