Chaganti Koteswara Rao : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ అధికారిక కార్యక్రమంలో ప్రముఖ ధార్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా జరిగిన సభలో చాగంటి ప్రసంగిస్తున్న సమయంలో, వేదికపై అభిమానులు, నాయకులు గుంపులుగా చేరి ఫోటోలు తీయడం ప్రారంభించడంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాగంటిని సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించేందుకు వేదికపైకి వచ్చారు. అయితే, ఆయన వెనుక పలువురు నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించడంతో, ప్రసంగాన్ని ఒక్కసారిగా ఆపిన చాగంటి, ఆ ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tamil Nadu Custodial Death: వెలుగులోకి పోస్ట్‌మార్టం రిపోర్ట్.. ఆందోళన కలిగిస్తున్న అంశాలు
“ఇది ఓ మహానుభావుడి జయంతి సభ. ఇక్కడి వేదికకు ఓ గౌరవం ఉండాలి. ఈ సమయంలో వెనుక నిలబడి ఫోటోలు తీయడం అనుచితం. మీరు దయచేసి కిందకు వెళ్లి కూర్చోండి,” అని ఆయన కాస్త గట్టి స్వరంతో సూచించారు. ఆయన మాటలతో సభలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది. అనంతరం చాగంటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రోశయ్యతో తనకు ఉన్న సాన్నిహిత్యం, ఆయనలోని వినయాన్ని గుర్తుచేశారు.
తమిళనాడులో గవర్నర్‌గా ఉన్న సమయంలో రోశయ్య స్వయంగా తనను రాజభవన్‌కు ఆహ్వానించి గౌరవించారని, అది తనకు మరపురాని సంఘటనగా నిలిచిపోయిందని చాగంటి భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.