PVN Madhav: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్.. వరుసగా రాజకీయ నేతలు, ప్రముఖులను కలుస్తున్నారు.. ఇక, గురు పౌర్ణమి సందర్భంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గోశాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను పూర్తి చేసి ముందుకు వెళ్తున్నామని.. ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు.. సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించానని తెలిపారు.. ఏపీకి కొత్త పోర్ట్‌లు, ఎయిర్ పోర్ట్ లు వస్తున్నాయని తెలిపారు.. ఇక, కాకినాడ ప్రవచన రాజధానిగా మారిందని తెలిపారు బీజేపీ చీఫ్..
Read Also: Pragya Jaiswal : బికినీలో మొత్తం చూపిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
మరోవైపు, చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన ఐదు పుస్తకాలను పాఠ్యంశాల్లో చేర్చే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు మాధవ్.. కేంద్ర ప్రభుత్వం నిధులతో మెడికల్ కాలేజ్, హాస్పిటల్ నిర్మాణలు జరుగుతున్నాయని.. 1400 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు మాధవ్.. ఇక, చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తనంత తాను ఎవరూ గురువులు అవ్వరు.. ఎవరి యందు గురి ఉందో వాళ్లు గురువులు అవుతారు.. మాధవ్ వినయం భక్తి ప్రేమతో నా ఆశీర్వచనం తీసుకున్నారు.. ధర్మం వ్యాప్తి చెందడానికి మాధవ్ కృషి చేస్తారు.. ధర్మ వ్యాప్తి ద్వారా విజయం సాధించాలని ఆకాక్షించారు చాగంటి కోటేశ్వరరావు.