కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్.. ఇక ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే వాహనదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.. దేశవ్యాప్తంగా కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియతో.. రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ సులభతరం కానుంది.. ఇది అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)తో రిజిస్ట్రేషన్లు చేస్తారు.. ఈ ప్రక్రియతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.. మరో రాష్ట్రానికి బదిలీ అయి వెళ్లగానే వారి వాహనాలకు అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.. బీహెచ్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు.. నేషనల్‌పర్మిట్ లభించనుంది.. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టంలోని 20వ సవరణ, 2021 చట్టం.. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది ప్రభుత్వం..
కాగా, భారత్ సిరీస్ ప్రక్రియపై ఈ వారమే ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం… ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్ చేసే వాహనాలు అన్నింటికీ బీహెచ్ సిరీస్ వర్తిస్తుంది.. అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న మోటార్ వెహికిల్ చట్టం 1988 ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాన్ని మరో రాష్ట్రానికి తీసుకెళ్లిన తర్వాత ఏడాదిలోగా అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది.. దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.. ఎందుకంటే.. వాహనం యజమానికి ఎన్‌వోసీ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ ఆఫీసు చుట్టూ తిరగడం, పన్నులు చెల్లించడం వంటి తలనొప్పులు తప్పేవి కావు.. కానీ, కొత్త విధానంతో.. రాష్ట్రం మారేవారు వారి వాహనానికి స్థానికంగా తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఇక ఉండదు.. ఈ కొత్త ప్రక్రియలో వాహనానికి ‘YY BH 1234 XX’ మాదిరిగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీనిలో తొలి రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరాన్ని, తర్వాత బీహెచ్ అంటే భారత్ సిరీస్‌ను.. తర్వాత నాలుగు అంకెలతో వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. చివరన ఉండే రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రాన్ని సూచించనుంది.. భారత్ సిరీస్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ సౌకర్యం రక్షణ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర పీఎస్‌యూలు, ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థలకు స్వచ్ఛందంగా ఇవ్వనున్నారు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలు, ఆయా సంస్థల ఉద్యోగులు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే, బీహెచ్ సిరీస్ వాహనాలు ఒకేసారి రెండేండ్ల పాటు రోడ్డు పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!