కరోనా మహమ్మారి విజృంభణతో ఐటీ రిటర్న్స్ గడువును పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం.. అయితే, ఇప్పుడు కొత్త వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో కూడా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును ఆదాయ పన్నుశాఖ పొడిగిస్తూ వస్తోంది… ఇప్పుడున్న డెడ్‌లైన్ ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది.. కానీ, మరోసారి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.. కొత్త వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్ వర్గాలకు సూచించారు.. అప్పటి వరకు అన్ని సమస్యలను చెక్ పెట్టినా.. మరో 15 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది.. అంత తక్కువ సమయంలో ఐటీ రిటర్న్స్ సమర్పణ సాధ్యం కాదనే భావనలో ఉన్నారు.. దీంతో.. మరోసారి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఇన్ఫోసిస్ కొత్త ఐటీఆర్ పోర్టల్‌లో స్నాగ్‌లను పరిష్కరించిన తర్వాత ఐటీ రిటర్న్స్‌లో వేగం పుంజుకున్నప్పటికీ, పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో గడువు పొడిగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.