షాక్ తప్పదా..? గ్యాస్ సబ్సిడీ కోసం కొత్త పథకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు చేరువవుతోంది.. పెట్రో ధరలతో పాటు క్రంగా గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇదే సమయంలో.. వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. దీనిపై అంతర్గతంగా చర్చ ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరుసగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలపై ప్రభుత్వం ఓ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వేలో.. పెరిగిన గ్యాస్ ధరలను చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నట్టుగా తేలిందట.. దీంతో.. గ్యాస్ సిలిండర్‌పై మరింత వడ్డింపు తప్పదనే చర్చ మొదలైంది. దీని కోసమే కొత్త పథకం ప్రవేశపెట్టే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.. దీనికోసం రెండు ప్రతిపాదనలపై దృష్టిసారించింది కేంద్రం.. అందులో ఒకటి.. ఎలాంటి సబ్సిడీ లేకుండా గ్యాస్ సిలిండర్లను ఏ వినియోగదారుడికైనా అమ్మడం అయితే.. రెండోది ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను అందించడం.. ఇప్పుడు అంతర్గత ఈ విషయంపైనే చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతునన సమాచారం ప్రచారం.. కొత్త పథకం ద్వారా కుటుంబ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు, ఆపైగా ఉన్న కుటుంబాలకు గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి రాయితీ ఇవ్వదు సర్కార్.. అవసరమైన ప్రజలకే గ్యాస్ సబ్సిడీ ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని భావనలో సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది.. అయితే, కరోనా నేపథ్యంలో అంతర్జాతీయగా ముడి చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది మే నుంచి గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీని చాలా వరకు నిలిపివేశారు.. రెండు ప్రదిపాదనలు ఉన్నా.. క్రమంగా వంట గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయడమే ఎన్డీఏ సర్కార్ ప్లాన్‌గా ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?