వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు.
Udayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన సమగ్ర శిక్ష అభియాన్ కి వచ్చే 2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదని పేర్కొన్నారు. మీ అయ్యా సొమ్ము ఏం అడగడం లేదని విమర్శలు గుప్పించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో అమలవుతున్న నో డిటెన్షన్ విధానాన్ని తాజాగా కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇకపై 5 నుంచి 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంది.
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . ఎక్స్‌లో కాంగ్రెస్ అధినేత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
Supreme court: ఎన్నికల టైంలో పొలిటికల్ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
Manipur: మణిపూర్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న జాతి వివాదానికి పరిష్కారం కనుగొని శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు (మంగళవారం) న్యూ ఢిల్లీలో మైతీ, కుకీ మరియు నాగా కమ్యూనిటీలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Rahul Gandhi: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలో భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనం అయిందని ఆరోపించింది. ఈ లీకేజీ కుంభకోణంలో 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.